కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి – పల్లా

-

కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారు అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేసీఆర్ గారికి అండగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన కడియం శ్రీహరిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మోసం చేసి పార్టీ మారుతున్నాడని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

బీఆర్ఎస్ పార్టీలోని నేతలను ఒక్కొక్కరిని బయటకు పంపుతూ కడియం శ్రీహరి ఈరోజు డబ్బులు, పదవుల ఆశతో పార్టీని విడిచి వెళ్ళిపోతున్నాడు…. స్టేషన్ ఘన్‌పూర్‌లో కార్యకర్తలకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాగా కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్‌ పార్టీలో చేరే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news