సామాన్యుడికి షాక్… మళ్లీ పెరుగనున్న వంట నూనెల ధరలు..!

-

గత కొన్నాళ్లుగా వంట నూనెల ధరలు తగ్గాయి. సామాన్యుడికి ఊరట కలిగించాయి. మరోవైపు దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే తాజాగా సామాన్యుడికి షాక్ కలిగించే వార్త వినిపిస్తోంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో సామాన్య కుటుంబాలపై మళ్లీ భారం పడక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్ కు ఎక్కువగా ఇండోనేషియా నుంచే ఎక్కువగా దిగుమతి అవుతోంది. దాదాపుగా ఇండియా 60 శాతం పామాయిల్ ను దిగుమతి చేసుకుంటే.. దీంట్లో సింహభాగం ఇండోనేషియా నుంచే వస్తోంది. అయితే తాజాగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశం నుంచి ఎగుమతులను తగ్గించాలని నిర్ణయించింది. తమ దేశంలో వంట నూనెల ధరలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియాపై ప్రత్యక్షంగా ప్రభావం చూపించనుంది. దీంతో రానున్న కాలంలో ఇండియాలో వంట నూనెల ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news