నేను పార్టీ మారట్లేదు: పాల్వాయి స్రవంతి

-

లేదని మునుగోడు కాంగ్రెస్ మహిళా నేత పాల్వాయి స్రవంతి తెలిపారు. ‘నేను కాంగ్రెస్లోనే ఉంటా. కొందరు నాపై కుట్ర పన్ని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’ అని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి.. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. గత ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాంటి వార్తలు ప్రచారం అయ్యాయని గుర్తు చేశారు. తాను మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, మునుగోడు మండలాల్లో పర్యటించి పార్టీ కార్యకర్తల్ని కలిసి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నానని చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం నిర్ణయం తీసుకుంటున్న వేళ ఇలాంటి వార్తలు రావడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా పాల్వాయి స్రవంతి ఓ వీడియో విడుదల చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాల్వాయి స్రవంతి కీలక నేతలుగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం 2018 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చింది. తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ గెలుపు కోసమే పని చేశారు. 15 నెలల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డారు. పది వేల మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ గెలుపొందారు. పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news