ఆధార్‌తో పాన్ లింక్ చేశారా? లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు..!

-

పాన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటి. అలానే అన్నింటికీ ఆధార్ కార్డు కూడా చాలా అవసరం. అయితే పాన్ ఆధార్ లింక్ తప్పక లింక్ చెయ్యడం మంచిది. లేదు అంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఆధార్‌తో పాన్ లింక్

పాన్ కార్డును ఆధార్ కార్డు తో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి. అప్పుడే ఇబ్బందులు ఉండవు. దీనికి జూన్ 30 వరకు గడువు ఉంది. అందువల్ల మీరు ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోవాలి. ఒకవేళ కనుక పాన్ ఆధార్ లింక్ చేసుకోక పోతే తప్పకుండ ఈ నష్టాలు ఉంటాయి. మరి వాటి కోసం ఇప్పుడే తెలుసుకోండి.

* మీ పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ఆ పాన్ కార్డు అస్సలు చెల్లుబాటు కాదు.
* ఆ చెల్లుబాటు కాని పాన్ ని ఉపయోగించడం శిక్షార్హం. ఇంకా రూ.1000 జరిమానా చెల్లించుకోవాలి.
* అలానే మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టాలంటే కచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. అది చెల్లకపోతే ఎంఎఫ్‌లో డబ్బులు పెట్టలేరు.
* బ్యాంక్‌లో అకౌంట్ తెరవాలన్నా లేదా రూ.50 వేలకు పైన డబ్బులు డిపాజిల్/విత్‌డ్రాకు కచ్చితంగా పాన్ అవసరం         అవుతుందిరూ.5 లక్షలకు పైన బంగారు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలంటే తప్పక పాన్ వివరాలు కావాలి.
* వెహికిల్ ని కొనుగోలు చెయ్యాలన్న పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు పైన వెహికల్ లేదా కారు కొనుగోలుకు. పాన్ తప్పక ఇవ్వాలి.
* పాన్ ఆధార్ లింక్ కాకపోతే డబుల్ టీడీఎస్ పడుతుంది.
* స్టాక్ మార్కెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడం కుదరదు.
* ఐటీఆర్ దాఖలు చేయాలన్నా ఎవ్వడు.
* పాన్ కార్డు చెల్లుబాటు కాకపోతే అప్పుడు మీరు ఎక్కడైనా కేవైసీ కోసం పాన్ ఇచ్చి ఉంటే అది చెల్లదు.

Read more RELATED
Recommended to you

Latest news