UPPENA : బుల్లి తెరను షేక్‌ చేస్తోన్న “ఉప్పెన”.. విజయ్ కి షాక్ !

-

2021 లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఉప్పెన సినిమానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన UPPENA మూవీ ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రికార్డును నమోదు చేసింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో వైష్ణవ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన మూవీ ఉప్పెన. ఫిబ్రవరి 12న వచ్చిన ఈ సినిమా.. కొవిడ్ టైమ్ లోనూ రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ఒక డెబ్యూ హీరోకు ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. అటు థియేటర్లలో దుమ్ములేపిన ఈ మూవీ ఇప్పుడు.. టీవీలో కూడా సంచలనం రేపుతోంది.

UPPENA

ఏప్రిల్‌ 18న ఉప్పెన మూవీ తొలిసారి బుల్లితెరపై ప్రసారం కాగా.. అప్పుడు 18.5 టీఆర్పీ వచ్చింది. ఇప్పుడు రెండో సారి ప్రసారం కాగా.. 11.37 దక్కింది. అయితే… అదే సమయంలో ఉప్పెనకు పోటీగా తమిళ స్టార్‌ హీరో విజయ నటించిన మాస్టర్‌ సినిమా వేరే ఛానల్‌లో ప్రసారం అయింది. ఈ సినిమా తొలిసారి ప్రసారం అయినప్పుడు 4.8 టీఆర్పీ రేటింగ్‌ దక్కించుకోగా.. తాజాగా 3.8 రేటింగ్‌ కే పరిమితం అయింది. విజయ్‌ మూవీ కంటే ఉప్పెన మూవీ ఎక్కువ టీఆర్పీని రాబట్టుకోవడం అందరిని షాక్‌ కు గురిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news