శ్రీలంక: దేహాలను తాకట్టుపెట్టి మరీ మందులు తెచ్చుకుంటున్న తల్లులు

-

శ్రీలంక పరిస్థితి గురించి ఇప్పుడు యావత్‌ దేశం మాట్లాడుకుంటుంది. తింటానికి తిండి లేదు, చేయడానికి ఉద్యోగం లేదు. ఒకప్పుడు బాగా బతికిన వాళ్లు ఇప్పడు రోడ్డు మీద బర్గర్లు అమ్ముకుంటున్నారు. మహిళల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పొట్టకూటి కోసం సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. పిల్లల కడుపు నింపేందుకు ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తుంది. దేహాలను తాకట్టు పెట్టి ఎంతోమంది తల్లులు ఆహారం, మందులు తెచ్చుకుంటున్నారు.

శ్రీలంకలో ఎన్నోరంగాలు కుదేళ్లయ్యాయి. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక బోసిపోయింది. ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోతామన్న భయంతో ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఇతర రంగాల్లో ఉద్యోగాలు లేక వేశ్యల్లా మారుతున్నారట. ‘‘ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించేందుకు సెక్స్‌ వర్కే ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. మామూలుగా మేం టెక్స్‌టైల్‌ రంగంలో నెలకు రూ.28వేల నుంచి రూ.35వేల వరకు జీతం తీసుకునేవాళ్లం. ఇప్పుడు సెక్స్‌ వర్క్‌ చేస్తే నెలకు రూ. 15వేలు మాత్రమే వస్తున్నాయని ఆ మహిళలు అంటున్నారు. తప్పైన తప్పక చేయాల్సి వస్తుందోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న మహిళల సంఖ్య 30 శాతం పెరిగిందంటే అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే ఆలోచించండి. ముఖ్యంగా కొలంబో ఇండస్ట్రియల్‌ జోన్‌కు సమీపంలో ఈ తాత్కాలిక సెక్స్‌ వర్కర్లు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగారు. ఈ వేశ్యాగృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంధనం, ఆహార, ఔషధాల కొరత మహిళల చేత ఈ చీకటి పనులు చేయిస్తోంది. పిల్లలు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్న మహిళలు ఎక్కువగా ఈ వృత్తిలోకి మారుతున్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.. ఆహారం, మందులకు డబ్బుల్లేక స్థానిక దుకాణదారులకు బలవంతంగా తమ శరీరాలను అప్పగించి వాటిని కొనుక్కునే పరిస్థితికి ఏర్పడింది. ఇక్కడ తప్పు ఎవరిది..ఎవరో చేసిన అనాలోచిత పనులు వల్ల నేడు ఈ తల్లులు ఇలాంటి దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుంది. శ్రీలంక లాంటి పరస్థితి తెచ్చుకోవద్దని కేంద్ర ప్రభుత్వం తాజాగా మన దేశంలో పది రాష్ట్రాలను హెచ్చరించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version