రాజేంద్రనగర్ లో ఆపరేషన్ చిరుత.. రంగంలోకి దిగిన అటవీశాఖ !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో వరుసగా చిరుతలు టెన్షన్ పెడుతున్నాయి. మహరాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు వారంలో కనీసం రెండు మూడు సార్లైనా చిరుత జాడలు అక్కడి గ్రామస్తులను టెన్షన్ పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో కూడా చిరుత టెన్షన్ పెడుతోంది.అందుకే చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చర్యలు మొదలు పెట్టారు. అందుతున్న సమాచారం మేరకు చిరుత సంచారాన్ని పసిగట్టేందుకు గాను ఇరవై ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

రాజేంద్ర నగర్ లో ఉన్న ఫాతిమా ఫామ్  హౌస్లో ఈ కెమెరాలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఒక వేళ చిరుత సంచారం కెమెరాలలో రికార్డు అయితే బొన్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. నిన్న ఆవు మీద చిరుతే దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే దానిని బంధించేందుకు గాను ఇప్పుడు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. చిరుత రాక కనుక కెమెరాల్లో రికార్డ్ అయితే రేపు దాని కోసం బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...