వరుసగా ఎనిమిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు

Join Our Community
follow manalokam on social media

దేశంలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదేమంటే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు. ఇక గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు కూడా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ చమురు కంపెనీలు వరుసగా ఎనిమిదో రోజు కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

లీటర్ పెట్రోల్‌పై 38 పైసలు పెంచగా.. డీజిల్‌పై కూడా 39 పైసలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్‌ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.53 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 86.55 గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.55 కాగా  లీటర్ డీజిల్ ధర రూ. 89.02 గా ఉంది. ఇక ఏపీలో ప్రత్యేక ఛార్జ్ లు కూడా వసూలు చేస్తూ ఉండడంతో మిగతా రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువగానే ఉంది.

TOP STORIES

ఎంఆధార్‌ యాప్‌ తో 35 రకాల ఆధార్ సేవలు… వివరాలు ఇవే..!

మీ ఫోన్ లో ఎంఆధార్‌ యాప్ వుందా...? అయితే మంచిగా 35 రకాల ఆధార్ సేవలు వున్నాయి. సులువుగా ఉపయోగించుకోండి. దీని వలన మీకు సూపర్...