జగన్ కార్యక్రమాలు చూసి జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారట !

వాలంటీర్లకు సత్కారం, అవార్డుల  కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సత్కార కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించగా ఆ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి, జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారథి, రక్షణ నిధి, రమేష్ బాబు, ఎంపీ బాలశౌరి, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సంధరభంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి దేశంలోని పేదలందరూ జగన్ ప్రధాని కావాలని కోరుకుంటారని అన్నారు. అయితే పార్థసారథి వ్యాఖ్యలకు వాలంటీర్లు, అభిమానులు పెను స్పందన వచ్చింది. అయితే సీఎం జగన్ చిరునవ్వులు చిందించడం గమనార్హం.