గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవపాడు మండలం కల్లుకుంట్లలో పరువు హత్య చోటుచేసుకుంది. డిగ్రీ చదువుతున్న దివ్య అనే యువతి వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. ఎంత చెప్పినా వినకుండా అతన్నే పెళ్లి చేసుకుంటా అనడంతో తల్లిదండ్రులు కూతురిని చంపారు. పరువు కోసం దివ్యను తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి అర్థరాత్రి గొంతునులిమి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.