ప్రకాష్ రెడ్డికి పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ !

Join Our Community
follow manalokam on social media

రాప్తాడులో జరిగిన ఎన్టీఆర్ వర్థంతిలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి , అక్రమాలప్తె వ్తెసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.టిడిపి చేసిన అభివృద్ధి పనులకు  వైసీపీ స్టిక్కర్లు వేసుకుంటోంది ఆరోపించారు. ఆ రోడ్లపై పర్సెంటేజీల పేరుతో  కాసులు ఏరుకుంటున్నారని, టమోటా మండీల్లో పెత్తనం చేస్తూ టోల్ పెట్టి వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.

భూములమ్మాలన్నా కొనాలన్నా ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సి వస్తోందని..జాకీ భూములు నీ కుటుంబ సభ్యులు చైర్మన్ గా వున్న సహకారసంఘానికి రాయించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అవినీతి అక్రమాలను వెలికి తీసి నీకు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే వున్నాయని ఖబడ్దార్ అంటూ ప్రకాష్ కు హెచ్చరించారు.ఇంటిలో ఐదు ఎమ్మెల్యేలు ఉన్నారని  ఒక్కో అవినీతి వ్యవస్థకు  ఒక్కరిని   ఇన్ చార్జ్ గా పెట్టి దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

TOP STORIES

మీరు చేసే జాబ్ మీకు హ్యాపీగా అనిపించాలంటే వీటిని అనుసరించండి..!

మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ...