చంద్రబాబు గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుంది : పరిటాల సునీత వార్నింగ్

చంద్రబాబు ఒక గంట కళ్ళు మూసుకుంటే కథ వేరేలా ఉంటుంది అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం ప్రభుత్వం వస్తుంది అని ఎప్పుడైనా చంద్రన్న మారాలి అని…. చంద్రన్న సీఎం అయిన తర్వాత ఒక గంట కళ్ళు మూసుకోవాలి అని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చంద్రన్న గంట కళ్ళు మూసుకుంటే వైసీపీ వాళ్లకు చుక్కులు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన భర్త పరిటాల రవిని చంపినప్పుడు కూడా చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు అని కాబట్టే ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈరోజుకు కూడా రక్తం ఉడుకుతోందని…తమలో పారేది కూడా సీమ రక్తమే అని అన్నారు. సీఎం ను అంటే తమ కార్యకర్తలకు బీపీ వస్తుందన్నారు… మా నాయకుణ్ణి అంటే మాకు బిపి రాదా అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు ఓకే అన్న సరే…వైసీపీ వాళ్లకు చుక్కలు చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు.