Amazon Prime: కరోనా ప్రభావం వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్ని.. సొంతింటి థియేటర్లుగా మారిపోయాయి. విడుదలైన ప్రతి సినిమాను ఎంచక్క ఇంట్లోనే కూర్చోని వీలు కుదిరింది. ఈ ఏడాది చిన్నచితకా హీరోలే కాదు, స్టార్ హీరోల సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. వినోదాన్ని పంచాయి. ఈ క్రమంలో సామాన్య ప్రేక్షకుడు కూడా ఓటీటీలకు అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలో ఓటీటీలో బడా అయినా.. అమెజాన్ తన కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధరను భారీగా పెంచింది. ఇండియాలో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు పరిశీలిస్తే.. అవాక్కు అయ్యేలా చేసింది. కొత్త ధరలు దాదాపు 50 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. దీంతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వారికి, అలాగే తీసుకోబోయే వారికి భారీ షాక్ తగలినట్టు అయ్యింది.
ప్రస్తుత ధరలు ఇలా.. దేశీయ యూజర్లకు నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.129గా ఉండగా.. మూడు నెలల సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.329గా ..అలాగే ఇయర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.999కు లభిస్తోంది.
కొత్త ప్లాన్స్ ప్రకారం .. ఇయర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.1,499కి పెరగనుంది. మంథ్లీ ప్లాన్ రూ.179గా చేరనుంది. మూడు నెలల ప్లాన్ రూ.459కి పెరగనున్నట్టు వెల్లడించారు. ఇక స్టూడెంట్స్కు ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్స్, టెలికాం ఆపరేటర్లతో కలిసి ఇచ్చే ప్రమోషనల్ ఆఫర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
అయితే.. ఈ కొత్త ధరలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై అధికార ప్రకటన రాలేదు. ఈ-కామర్స్ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ ముగిసిన తర్వాత .. పెంచిన కొత్త ప్లాన్స్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. దీనిపై అమెజాన్ ఇండియా త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.