పార్లమెంట్ ముందుకు మహిళ వివాహ వయస్సు పెంపు బిల్లు… బిల్లుపై విపక్షాల ఆందోళన

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా వివాహ వయస్సు బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బిల్లును కేంద్రం లోక్ సభ ముందు ప్రవేశపెట్టింది. ఇటీవల మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లు పెంచుతూ.. కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఈరోజు బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చింది. అయితే ఈ బిల్లు పై పార్లమెంట్ లో రగడ నెలకొంది. బిల్లును వ్యతిరేఖిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. హడావుడిగా బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ బిల్లును వ్యతిరేఖించింది. కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో లోక్ సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్షాలు ఆందోళన చేశాయి. అయితే ఆందోళన మధ్య లోక్ సభ రేపటకి వాయిదా పడింది.

ఇంతకు ముందు అసదుద్దీన్ తోపాటు మరికొంత మంది నాయకులు ఈ వివాహ వయస్సు పెంపు బిల్లును వ్యతిరేఖించారు. అయితే దేశవ్యాప్తంగా అమ్మాయిల వివాహ వయసు పెంపుపై ఏర్పాటు చేసిన జయజైట్లీ నాయకత్వంలోని టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగానే బిల్లును తీసుకువచ్చినట్లు కేంద్రం అంటోంది. 18 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు జరిగితే అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది.