మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.1000 కోట్లు.. ప్ర‌ధాని మోడీ కీలక ప్ర‌క‌ట‌న !

దేశంలో ఉన్న‌టు వంటి మ‌హిళ‌ల‌కు ప్ర‌ధాని మోడీ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. మ‌హిళా సాధికార‌త‌కు, అమ్మాయిల సంర‌క్ష‌ణ‌కు క‌ట్టు బ‌డి ఉంటామ‌నే.. బీజేపీ స‌ర్కార్ ఆ దిశ గా ఇవాళ కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఒక‌టీ రెండూ… ఏకంగా… 16 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ల‌బ్ది చేకూర్చుతూ భారీ ఎత్తున రూ. 1000 కోట్ల న‌గ‌దును వారి ఖాతాల్లోకి జ‌మ చేయ‌నుంది కేంద్ర ప్ర‌భుత్వం.

ప్ర‌ధాన మంంత్రి న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా శాంపిల్ చెక్కులు అందుకోనున్న మ‌హిళ‌లు.. ఆయ‌న‌తో ముచ్చటించ‌నున్నారు. మ‌రోవైపు రాష్ట్ర స‌ర్కార్ సైతం ఆడ‌పిల్ల‌ల కోసం ఉద్దేశించిన నిధి నుంచి రూ.20 కోట్ల‌ను పంపిణీ చేయ‌నుండ‌గా.. వాటిని కూడా ప్ర‌ధాని మోడీనే బ‌దిలీ చేయ‌నున్నారు. అతి త్వ‌ర‌లోనే.. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మ‌యంలోనే… ఈ భారీ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. అయితే ఇవాళ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోమోడీ ప‌ర్యటించ‌నున్నారు. మ‌రి ఇవాళ ఈ పథ‌కంపై ప్ర‌క‌ట‌న వ‌స్తుందో చూడాలి.