న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. తమ ఫోన్లు ట్యాపింగ్ గురువుతున్నాయంటూ లోక్‌సభలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కేంద్ర హోంమంత్రి రాజీనామా రాజీనామా చేయాలంటూ పట్టుపట్టాయి. స్పీకర్ వెల్ వైపు దూసుకెళ్లేందుకు విపక్ష ఎంపీలు యత్నించారు. హోంమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ ప్రతిపక్ష నేతలు ఎంతకీ వెనక్కి తగ్గలేదు. ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో లోక్‌సభలో గందరగళం నెలకొంది. రాజ్యసభలో కూడా పెగాసస్ అంశం దుమారం రేపింది. దీంతో రాజ్యసభను ఛైర్మన్ వాయిదా వేశారు.
ఇక పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభంకాగానే లోక్ సభలో పోలవరంపై చర్చించాలని వైసీపీ తీర్మానం పెట్టింది. రాజ్యసభలో ఫార్టీ ఫిరాయింపులపై రూల్స్ 267 కింది వైసీపీ ఎంపీలు నోటిస్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై చర్చించాలని డిమాండ్ చేసింది.