కాపులకు పార్టీ అండగా ఉంటుంది – మంత్రి ధర్మాన

-

కాపులకు పార్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. నేడు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రాజధాని అయితే మన పరిస్థితులు మారిపోతాయి అన్నారు. కులమనో, ఇంకొకటనో మనం మారిపోకూడదని.. జగన్ చేతులను బలపరచాలని కోరారు. పట్టపద్రుల ఎలక్షన్ గెలిస్తే ఎడ్యుకేటెడ్ లో బలంగా ఉన్నామని చాటి చెప్పవచ్చు అన్నారు. ఎలక్షన్ తర్వాత టిడిపిలోని యాదవులను కూడా పిలిచి మన వైపు మార్చుకోవాలన్నారు.

అసత్యాలు ప్రచారం చేసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు మంత్రి ధర్మాన. యాదవులకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోవడం ప్రత్యేకత అని.. కానీ టిడిపికి యాదవులంతా గంపగుత్తగా వెళ్లిపోయారని అన్నారు. టిడిపికి ఎంతో బలం చేకూర్చిన యాదవులకు జిల్లా నుంచి అవకాశం ఇవ్వలేదన్నారు. జిల్లాలో నాలుగో అతిపెద్ద కమ్యూనిటీ యాదవులదేనన్న ఆయన.. యాదవులు అంతా ఒకవైపు ఉండాలని కోరారు. గెలిచాక యాదవులంతా గర్జన పెట్టి వైసీపీని బలపరచాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version