ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో నడపబడుతున్న పతంజలి గ్రూప్.. కోవిడ్ 19 మందు కోసం ఆయుర్వేద ఔషధాలతో మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ ఇప్పటికే అనుమతులు పొందింది. కాగా ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కరోనాకు చికిత్స కోసం మెడిసిన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి. అందులో భాగంగానే పలు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ దశకు కూడా వచ్చాయి. ఇక పతంజలి కూడా ఆయుర్వేద ఔషధాలను ఉపయోగించి కోవిడ్ 19కు మందును కనుగొనే పనిలో పడింది. అందుకనే ఆ సంస్థ తాజాగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించింది.
కాగా తమ సంస్థ క్లినికల్ ట్రయల్స్‌లో.. కరోనాను పూర్తిగా నయం చేసేవిధంగా ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ప్రయోగిస్తామని ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఇక గత వారం కిందటే పతంజలి క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు పొందిందని తెలిసింది. అందులో భాగంగానే ఇండోర్, జైపూర్‌లలో ఉన్న పతంజలి ఆశ్రమాల్లో ఆ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిసింది.
ఇక కరోనాకు మెడిసిన్‌ను కనుగొనేందుకు గిలీడ్ సైన్సెస్, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఇనోవియో, గ్లాక్సో స్మిత్ క్లైన్ తదితర ప్రముఖ కంపెనీలు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. కానీ వాటి గురించిన వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు.