తన కూలీల కోసం విమానం టికెట్ లు బుక్ చేసిన యజమాని…!

-

లాక్ డౌన్ లో చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వలస కూలీలు అయితే నరకం చూస్తున్నారు. తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక వేల కిలోమీటర్లు సొంత గ్రామాలకి తరలి వెళ్తున్నారు. వేల కిలోమీటర్ల వారి ప్రయాణం ఇప్పుడు దేశానికి అవమానంగా మారింది. తినడానికి తిండి లేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉంది అనేది వాస్తవం. ఈ తరుణంలో వారి కోసం శ్రామిక్ ట్రైన్స్ ఏర్పాటు చేసినా సరే పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.

ఇక ఇదిలా ఉంటే ఒక యజమాని తన వద్ద పని చేసిన వలస కూలీల కోసం ఏకంగా విమానం టికెట్ లు బుక్ చేసారు. ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న వలస కూలీలు ఈ విషయాన్ని ఐజిఐ విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు. పప్పన్ గాహ్లాట్ అనే ఒక యజమాని తన దగ్గర పని చేస్తున్న పది మనది వలస కూలీలకు విమాన టికెట్ లు కొని సొంత ఊర్లకు పంపించాడు. ఇందుకోసం 68 వేల రూపాయలను ఈ కష్ట కాలంలో అతను ఖర్చు చేసాడు.

20 ఏళ్ళుగా అతని వద్ద వాళ్ళు పని చేస్తున్నారు. ఇక పని లేకపోవడం ఆర్ధికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉండటంతో వారిని ఇబ్బంది పెట్టకూడదు అని భావించి అందరికి విమానం టికెట్ లు బుక్ చేసి పంపించాడు. బీహార్ రాజధాని పాట్నాకు వెళ్ళారు వారు అందరూ. అక్కడికి వెళ్ళగానే వారిని హోం క్వారంటైన్ చేసారు అధికారులు. కాగా ఇదే తొలిసారి తాము విమానం ఎక్కడం అని వాళ్ళు హర్షం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news