స్టైలిష్ లుక్… మాస్ టైటిల్ …నరాలు తెగే ఉత్కంఠతను పెంచేస్తున్న మహేష్ ..!

-

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తుంది మే 31 కోసం. ఈ రోజు ఎప్పుడొస్తుందా అంటూ గంటలు లెక్కపెట్టుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే ఆ రోజే మహేష్ బాబు నటించబోయో లేటెస్ట్ సినిమా న్యూస్ అఫీషియల్ గా వెలువడనుంది. ఇప్పటికే మహేష్ బాబు సినిమా వచ్చి 5 నెలలు కావొస్తుంది. కాని సూపర్ స్టార్ నుండి కొత్త సినిమా కబురు రాలేదు. దాంతో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు 31 న కొత్త సినిమా అప్‌డేట్ రాబోతుంది.

 

మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో సినిమా మొదలవబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్దమయిందట. మే 31 ఈ సినిమాని అధికారకంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకు వేదిక మైత్రీమూవీ మేకర్స్ ఆఫీస్ కానుంది. ఆ ఆఫీసులోనే పలువురు ముఖ్య అథిదులు..ఇతర సన్నిహితుల మద్య ఘనంగా ప్రారంభం అవుతుందని వార్త వచ్చింది.

 

ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, అనిల్ సుంకర ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, మహేశ్ బాబు ఎంటర్ టెన్నెంట్స్ బ్యానర్స్ లో సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అంతేకాదు ఇటీవల సోషల్ మీడియాలో మహేష్ బాబు కొత్త మేకోవర్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని విపరీతంగా పెంచేస్తుంది. చెప్పాలంటే ఈ కొత్త లుక్ దాదాపు మహేష్ బాబు ని 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. అంత యంగ్ గా ఉన్నాడు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ మహేష్ బాబు కొడుకు గౌతం, కూతురు సితార లకి అన్నయ్య లా ఉన్నాడంటు సంబరంగా చెప్పుకుంటున్నారు.

 

ఇక ఈ సినిమాకి “సర్కారు వారి పాట” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం. చాలా పవర్ ఫుల్ గా ఉన్న ఈ మాస్ టైటిల్ కి మహేష్ క్లాస్ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటీ అంటూ తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. మరి ఈ రెండింటికి సమాధానం దొరకాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news