పఠాన్ మూవీ కలెక్షన్స్.. షారుక్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్..!

-

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజ్ కి ముందే సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలు ఈ సినిమా అనూహ్యమైన ఓపెనింగ్ మొదలవడానికి కారణం అయ్యాయి. గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డులు తిరగ రాసిన ఈ చిత్రం జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్లు రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.

గతంలో పఠాన్ సినిమాపై వివాదాలు.. అభిమానుల క్రేజ్ కొనసాగుతుండగా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కి ముందే షారుక్ ఖాన్ మూవీ అనూహ్యమైన స్పందనను కూడగట్టుకుంది. దాంతో ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ సినిమాలకు మించి అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేయడం గమనార్హం. దాదాపు బాహుబలి దరిదాపుల్లో ఈ సినిమా కలెక్షన్ సాధించింది అని చెప్పవచ్చు. ఆక్యుపెన్సీ విషయానికి వస్తే హిందీ వర్షన్ మూవీకి భారీ ఆక్యుపెన్సీ లభించింది ఢిల్లీ లో 32% , ముంబైలో 33%, బెంగళూరులో 45% , హైదరాబాదులో 50% కోల్కతాలో 70% చెన్నైలో 42% జైపూర్ లో 44%, లక్నోలో 35 శాతం, చండీగఢ్లో 31 శాతం ఆక్యుపెన్సీ లభించింది.

అలాగే తెలుగు, తమిళ్ వెర్షన్ లో కూడా భారీ స్థానాలలో ఆక్యుపెన్సీ నమోదయింది. తొలి రోజున ఈ సినిమా సుమారు రూ.50 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలి వారాంతం లోపు రూ.200 కోట్లు రాబట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే షారుక్ ఖాన్ సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ వసూల్ అయ్యాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news