పవన్ కల్యాణ్ పై సినిమా ఏమైంది వర్మ గారు..!!

-

రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తీసిన దర్శకుడు. అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తర్వాత మనోడు పడిపోతూ పాతాళం కు చేరుకున్నాడు. ఇక పిచ్చి సినిమా లు తీస్తూ అందులో విషయం లేకపోయినా ఇన్నాళ్లూ తన పబ్లిసిటీ స్టంట్ లతో మాయ చేస్తూ తన సినిమాలకు ఫ్రీ పబ్లిసిటీని ప్లాన్ చేస్తూ నెట్టింట వైరల్ అయ్యేలా చేసుకున్నాడు.

కాని అవేమి మనొడుకు ఉపయోగం పడటం లేదు. మొన్న కొండా సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు కొండా దంపతులు పరువు పోయింది. ఇక తర్వాత వచ్చిన లడికి సినిమా వేళ్ళ మీద లెక్క పెట్టుకొనే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అది కూడా అట్టర్ ప్లాప్ అయి కూర్చుంది.

ఇక పవన్ కల్యాణ్ పై వ్యూహం అనే సినిమా తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి దీనికి సంబందించిన అప్డేట్ లేదు. ఇక ఈయన సినిమా స్క్రిప్ట్ రాయడం అంటే చాలు మూడు రోజులలో పూర్తి చేస్తాడు. ఎందుకంటే దానిలో విషయం అస్సలు ఉండదు మరి. సినిమా షూటింగ్ కోసం నెల రోజులు పెట్టుకొని క్వాలిటీ లేకుండా చుట్టేస్తాడు. ఇక ఆ సినిమా కూడా పోస్టర్ వేసిన తర్వాత రోజే తిరిగి వస్తుంది. ఇక రామ్ గోపాల్ వర్మ మీద సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ కు లెక్కేలేదు. ఇక ఆ సినిమా వేస్తే పవన్ అభిమానులు చెలరేగి పోవటం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news