Breaking : రోస్టర్‌ పాయింట్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇటీవల ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం పెంచింది. అందుకు అనుగుణంగా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది. రోస్టర్ పాయింట్ను కూడా ఖరారు చేసింది. ఈ మేరకు సవరణలు చేసింది. దీంతో నియమకాల్లో ప్రతి పదో ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది.

Telangana govt. presents CAG report in assembly

కాగా.. తెలంగాణలో షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 1న ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జీవో నంబర్‌ 33 జారీ చేసింది. శనివారం (అక్టోబరు 1) నుంచి పెరిగిన కొత్త రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోని తీసుకుని.. వారికి రిజర్వేషన్లు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియమాకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్టీలకు 10, ఎస్సీలకు 15, బీసీలకు 29, ఈడబ్ల్యూఎస్‌‌కు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకుని ప్రగతిభవన్‌కు చేరుకున్న వెంటనే.. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news