వాళ్ళు ఆవేదనలో ఉన్నారు ఆదుకోండి; పవన్ ట్వీట్…!

-

ఏ మాటకు ఆ మాట దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రభావంతో ఎందరో రైతులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వేలాది మంది రైతులు ఇప్పుడు తమ పంటలను ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మినహా ఎవరూ కూడా రైతులను ఆదుకోవడానికి ముందుకి వచ్చే పరిస్థితి దాదాపుగా కనపడటం లేదు. దీనితో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

కొంత మంది రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. లాక్‌డౌన్‌ కారణంగా భవన నిర్మాణ కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్వీట్ చేసారు. రాష్ట్రంలో 21లక్షల మంది గుర్తింపు పొందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్న ఆయన… మరో 30లక్షల మంది వరకు గుర్తింపు పొందని కూలీలు ఉన్నారన్నారు.

కేంద్ర కార్మికశాఖ మంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు నిధులు విడుదల చేసేలా లేఖలు రాశారని… లాక్‌డౌన్‌ కారణంగా రోజు వారీ కూలీలు తమ జీవనాధారాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో 17.62 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయన్న ఆయన.. ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా అరటి రైతులు పంటను కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news