ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా వైరస్ బయటపడటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పుడు వారి కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణా ప్రభుత్వం కూడా వారి వలనే ఇప్పుడు భయపడే పరిస్థితి నెలకొంది.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనంతపురం ఇలా చాలా ప్రాంతాల నుంచి ఢిల్లీ వెళ్ళారు. ప్రార్ధనలు అయినా సరే ఢిల్లీ మర్కాజ్ భవన్ లో వాళ్ళు ఉన్నారు. దీనితో వాళ్లకు కరోనా సోకింది. వాళ్ళు అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని, అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. వారి వలనే ఇప్పుడు కరోనా రాష్ట్రంలో విస్తరిస్తుంది.
దాదాపు ఆరు జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానితో ఆయన భేటి అయ్యారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని ఆదేశించారు.