ఎప్పుడో కనుమరుగై పోయిన పవన్ దర్శకుడు మెగా ఫోన్ పట్టాడు.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్సే ప్రామాణికం. ఏ క్రాఫ్ట్ లో అయినా కెరీర్ బాగుండాలంటే సక్సెస్ కంపల్సరీ. ఐతే ఇది దర్శకులకి మరింత కఠినంగా ఉంటుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా అవకాశం రావడం చాలా కష్టం. అందుకే సక్సెస్ ఫుల్ దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. తాజాగా ఎప్పుడో కనుమరుగైపోయిన ఒకానొక దర్శకుడు మళ్ళీ మెగాఫోన్ పడుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా తీసిన వీర శంకర్, చాలా రోజుల తర్వాత దర్శకుడిగా సినిమా తీస్తున్నాడు. తన మొదటి సినిమాగా శ్రీకాంత్ హీరో గా ఐ లవ్యూ సినిమా తీసిన డైరెక్టర్ పవన్ తో చేసినప్పటికీ విజయం అందుకోలేక పోయాడు.

ప్రస్తుతం వంగవీటి, జార్జి రెడ్డి సినిమాల హీరో సందీప్ మాధవ్ తో సినిమాకి రెడీ అయ్యాడు. వంగవీటి, జార్జి రెడ్డి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సందీప్, ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తెరకెక్కిస్తుండడం కొంత ఆశ్చర్యమే. ఐతే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. సో.. వీర శంకర్ ఫామ్ లోకి వచ్చి విజయం అందుకుంటాడేమో చూడాలి.