ఇటలీలో పోంపీ బూడిద నుండి వెలికితీసిన 2,000 సంవత్సరాల పురాతన ఫాస్ట్ ఫుడ్ స్టాల్ ఒకటి ఆశ్చర్యంగా మారింది. పురాతన రోమన్ల అల్పాహార అలవాట్ల గురించి పరిశోధకులకు కొత్త ఆధారాలు ఇచ్చింది. పాలిక్రోమ్ నమూనాలతో అలంకరించి, అగ్నిపర్వత బూడిదతో కప్పి ఉన్న స్నాక్ బార్ కౌంటర్ గత సంవత్సరంలో పాక్షికంగా వెలికి తీసారు. కాని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ స్థలం పూర్తి వైభవాన్ని బహిర్గతం చేయడానికి అప్పటి నుంచి కష్టపడుతూ వచ్చారు.
క్రీ.శ 79 లో సమీపంలోని వెసువియస్ పర్వతంపై అగ్నిపర్వతం పేలిన సమయంలో… 2,000 నుంచి 15,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి కూడా పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు. బాతు ఎముక శకలాలు, అలాగే పందులు, మేకలు, చేపలు మరియు నత్తల అవశేషాలను మట్టి పాత్రల కుండలలో గుర్తించింది. మానవ అవశేషాలతో పాటు ఆంఫోరే, వాటర్ టవర్ మరియు ఫౌంటెన్ గుర్తించారు.
వ్యక్తి యొక్క అవశేషాలు కూడా కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు వైన్ లేదా వేడి పానీయాలతో వడ్డించడం కోసం మెనులో ఉన్నట్లు భావిస్తున్న జంతువుల బొమ్మలను గుర్తించారు. 44 హెక్టార్లలో (110 ఎకరాలు) విస్తరించి ఉన్న ఈ భారీ ప్రదేశం రోమన్ సామ్రాజ్యంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.