రామతీర్ధంలో పోలీసుల తీరు సరిగా లేదు…మండిపడ్డ పవన్ !

-

రామతీర్ధంలో పోలీసుల తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పోలీసులు సున్నిత సమయంలో సంయమనంతో వ్యవహరించలేదని ఆయన అన్నారు. రామతీర్థం క్షేత్రంలో కోదండరామ స్వామి విగ్రహం తల నరికి వేస్తే భక్తుల మనోభావాలు ఎంతో తీవ్రంగా గాయపడ్డాయని ఆయన అన్నారు. ఈ ఘాతుక చర్యను నిరసించిన వారిపై ఆ క్షేత్రంలో పోలీసులు వ్యవహరించిన విధానం  అప్రజాస్వామికంగా ఉందని పవ అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు రెడ్డి పావని సొమ్మసిల్లి పోయే విధంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని పవన్ అన్నారు.

ఆ వ్యవస్థ ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని ఆయన అన్నారు. అధికార పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు తమ పార్టీ వాళ్ళతో జెండాలు పట్టుకుని మరీ కొండ ఎక్కుతుంటే సహకరించిన పోలీసులు, ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వారి గొంతులు నొక్కడం, లాఠీలతో విరుచుకుపడటాన్ని ఖండిస్తున్నానని పవన్ అన్నారు. ఆలయాలపై దాడులను అరికట్టడంలో విఫలమైన పోలీసు వ్యవస్థ, దురదృష్టకర ఘటనలను నిరసించే వారిని మాత్రం కట్టడి చేస్తుందని అన్నారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక హక్కన్న పవన్ దీనిని కాలరాయాలని, తద్వారా తప్పులను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేయవద్దని పోలీసులను కోరుతున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news