ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ మరో పక్క సినిమా ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు పవన్. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా వరుసబెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఇటీవల ‘పింక్’ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తుండగానే క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేశారు.
కాగా తాజాగా తన కెరీర్ లో గబ్బర్ సింగ్ సినిమాతో మర్చిపోలేని సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి పవన్ రెడీ అయ్యారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో స్వయంగా పవన్ హరీష్ కలయికలో సినిమా వస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సినిమాలో హరీష్ శంకర్… పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ విషయంలో ఇద్దరి పేర్లు అనుకుంటున్నారట.
ఇద్దరిలో ఒకరు పూజా హెగ్డే కాగా మరొకరు శృతిహాసన్. ఇద్దరు హీరోయిన్లు తన డైరెక్షన్ లో గతంలో చేయడంతో వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలనే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నట్లు సమాచారం. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ నటించడం జరిగింది. దీంతో ఇటువంటి తరుణంలో ఇద్దరిలో ఎవరు పవన్ పక్కన అన్నది పవన్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది.