వైసీపీ తీరుకు చెప్పులు చూపించడమే కరెక్ట్‌ – పవన్ కళ్యాణ్

-

వైసీపీ తీరుకు చెప్పులు చూపించడమే కరెక్ట్‌ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “వైసీపీ విశాఖపట్నం కేంద్రంగా విధ్వంసం చేయాలని చూస్తోందని…. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహించారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని… దీనిలో భాగమే ఈ నెల 15వ తేదీన జరిగిన జనసేనపై ఆంక్షలు విధించారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రపై నాకున్న ప్రేమ మాటల్లో వ్యక్తం చేయలేనిదని.. సిక్కోలు ఉద్యమం నాకు పోరాట అడుగులు నేర్పితే, అక్కడి ఆటపాట నన్ను చైతన్యవంతుడ్ని చేశాయని వెల్లడించారు. అధికార పార్టీకే భావ స్వేచ్ఛ ఉంటుంది అని రాజ్యాంగం లో ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. మీకేమి కొత్తగా కొమ్ములు పుట్టుకు రాలేదు. మీకేమి కొత్తగా రాజ్యాంగం లేదన్నారు. వైసీపీ తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలి, పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news