జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరి మనసు గెలుచుకున్నారు. తాజాగా సైనికుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఒక కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్ళిన పవన్ వారికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గతం లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విధంగా సైనికులకు ఆర్ధిక సహాయం చేసారు. కార్గిల్ యుద్ధం సమయంలో పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు.
అప్పుడు సైనికుల కోసం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. దీనిపై ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరిపడరని, ఆయన మంచి మనసుకి రాజకీయాలు సరిపోవని, పవన్ చాలా మంది రాజకీయ నాయకుల కంటే చాలా ఎత్తులో ఉన్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక టీడీపీ వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
సైనికులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని, దేశం కోసం సర్వస్వం వదులుకుని వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారని, అలాంటి వారి కోసం పవన్ కళ్యాణ్ ముందుకి రావడం నిజంగా మంచి పరిణామం అంటున్నారు పలువురు. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానన్నారు.
భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీని 2014లో స్థాపించానన్నారు. తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓటమి పాలైనా కుంగిపోలేదన్నారు. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సంబంధిత అధికారులకు ఆయన కోటి రూపాయల చెక్ అందించారు. “నా లక్ష్యసాధన కోసం పనిచేస్తూనే ఉంటాను. నా దే శానికి సేవ చేయాలని కట్టుబడి ఉన్నాను” అని అన్నారు.