పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ..ఈరోజు అదిరిపోయే అప్డేట్స్ ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దాంతో పవన్ సినిమాలపై అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలపై అప్డేట్స్ ఇవ్వడానికి చిత్ర బృందాలు కూడా సిద్ధం అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రానా కాంబోలో మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. కాగా ఈరోజు ఈ సినిమా నుండి బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేయనున్నారు. మరోవైపు క్రిష్ దర్శకత్వం లో పవన్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

 

Pawan Kalyan

ఈ సినిమాపై నుండి మద్యానం 1:20 గంటలకు పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్న కారణంగా పోస్టర్ పై కూడా ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేశన్స్ పెట్టుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో లో ఓ సినిమా ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి సాయంత్రం 4:05 గంటలకు ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. వీటితో పాటు పీఎస్పీకే 29 సినిమా పై మధ్యాహ్నం 2:20 గంటలకు అనౌన్స్ మెంట్ రానుంది. ఇక పవన్ నటిస్తున్న నాలుగు సినిమా లపై అప్డేట్స్ ఉండటం తో ఫ్యాన్స్ ఎంతో కుషీ అవుతున్నారు.