వ్యర్థాలే…నేడు ఆదాయవనరులు!

-

మనదేశంలో వ్యర్థాల నిర్వహణ సమస్యతో కూడుకుంది. దీనిపై ఇప్పటికే చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 94 శాతం సేకరించిన వ్యర్థాలతో పర్యావరణాన్ని కలుషితం అవుతున్నాయి. ఇందులో ఉండే ప్లాస్టిక్‌ ఇతర లోహాలు భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కానీ, ఈ వ్యర్థాలను తగ్గించడానికి, అవి మనకు ఆదాయాన్ని తీసుకురావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొందరు ఈ చెత్తతో స్టార్టప్‌లు ప్రారంభించి, వీటిని రీసైకిల్‌ చేస్తూ బిజినెస్‌ చేస్తున్నారు.

vistharaku
ఫర్నిచర్‌ తయారీ..

ప్రతి ఇంట్లో ఫర్నిచర్‌ ఉపయోగిస్తాం. చెత్తను అప్‌ సైక్లింగ్‌ చేసి ఈ వస్తువులను తయారు చేయడం ఓ గొప్ప మార్గం. పెద్ద మొత్తం వ్యర్థాలతో కుర్చీలు, టేబుల్, అల్మారాలు వంటివి తయారు చేయవచ్చు. ఇలాగే పూణెకు చెందిన ప్రదీప్‌ జాదవ్‌ టైర్లు, బ్యారెల్స్‌తో ఫర్నిచర్‌ను రూపొందించారు. అదే గిగాంటిక్స్‌ ఫర్నిచర్‌. ఇప్పటికే దాదాపు 500 ఆర్డర్లను పూర్తి చేశారు. ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి చిన్నమొత్తం సరిపోతుంది. కానీ, లాభాలు ఎక్కువగా వస్తాయని ఆయన అన్నారు.

రీసైకిల్డ్‌ ఉత్పత్తులు..

ప్లాస్టిక్‌తో కొన్ని ఉపద్రవాలు వచ్చినా, దీంతో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే మన ఇళ్లలో క్యారీ బ్యాగ్స్‌ వాడుతున్నాం.
ముంబైకు చెందిన రీటా, ఇలాంటి బిజినెస్‌నే మొదలుపెట్టింది. 2016లో ఫేస్‌బుక్‌లో వాల్‌మార్ట్‌ షాపింగ్‌ బ్యాగ్‌లను ఓ మహిళ పాలిథిన్‌ బ్యాగుల స్ట్రిప్‌ని కట్‌ చేసి, వాటితో మ్యాట్స్, బ్యాగ్‌లుగా కత్తిరించి, తయారు చేసిన వీడియో చూసి, తను క్రోచెట్‌ తయారు చేయడం నేర్చుకుంది.

అలంకరణ సామగ్రీ..

ఢిల్లీకి చెందిన సిద్ధాంత్‌ కుమార్‌ వ్యర్థాలను అప్‌సైక్లింగ్‌ చేసే పనిని ప్రారంభించారు. దీన్ని ఐఐటీ బాంబేకు చెందిన డెనిమ్‌ డెకర్‌ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అక్కడ ఎలా తయారు చేయాలో నెర్పిస్తారని ఆయన చెప్పారు. ఈ డెనిమ్‌తో లాంతర్లు, పెన్‌ హోల్డర్లు తయారు చేస్తున్నామని చెప్పాడు. అంతేకాదు 33 ఏళ్ల మీనాక్షి శర్మ తివాచీలు, రగ్గులు, బ్యాగులు తయారీకి నెలకు 200 కిలోల పాత దుస్తులను రీసైక్లింగ్‌తో ఉపయోగిస్తున్నారు.

ఎకో ఫ్రెండ్లీ క్రోకరీ…

హైదరాబాద్‌కు చెందిన మాధవి, వేణుగోపాల్‌ ఎకో ఫ్రెండ్లీ విస్తరాకులు ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు. కార్పొరేట్‌ కెరీర్‌ను వదిలి ఆ జంట సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రారంభించింది. ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో తమ ఉత్పత్తులకు కూడా డిమాండ్‌ పెరుగుతుందని వేణుగోపాల్‌ చెప్పారు.

ఈ డంప్‌ చేసిన చెత్తను అందమైన అలంకరణ వస్తువులుగా మార్చవచ్చు. పాత ప్లాస్టిక్‌ సీసాలు, పాత్రలు, బట్టలు ఉపయోగించి చిన్న గృహాలంకరణ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వారణాసికి చెందిన శిఖా షా పాత ప్లాస్టిక్‌ కంటైనర్లతో ప్లాంటర్లు తయారు చేస్తూ ఓ గొప్ప ఉదాహరణగా ఉన్నారు. దీనికి హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ప్రజల అభిప్రాయం సేకరించండి. మీ ఉత్పత్తుల నాణ్యతను వివరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news