క్యాన్స‌ర్ తో ప‌వ‌న్ వీరాభిమాని మృతి…!

క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి తో పోరాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమాని మ‌ర‌నించారు. కృష్ణా జిల్లా వ‌త్స‌వాయి మండ‌లం లింగాల గ్రామానికి చెందిన భార్గ‌వ్ అనే యువ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఎంత‌గానో ఆభిమానించేవాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా విడుద‌లైందంటే ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టికెట్ కొనుక్కుని చూసేవాడు. అయితే భార్గ‌వ్ కొంత‌కాలం క్రితం అనారోగ్యం భారిన ప‌డ్డాడు. అంతే కాకుండా త‌న చివ‌రికోరిక ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌ల‌వ‌డ‌మేన‌ని చెప్పాడు.

pawan kalyan fan died with cancer
pawan kalyan fan died with cancer

దాంతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకువెళ్ల‌గా ప‌వ‌న్ ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతున్న భార్గ‌వ్ వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న‌కు ధైర్యం చెప్పాడు. అంతే కాకుండా చికిత్స కోసం రూ.5ల‌క్ష‌ల ఆర్థిక‌సాయం కూడా అందించాడు. ఆ త‌ర‌వాత భార్గ‌వ్ కోలుకున్నాడు. అనంత‌రం ఆస్ప‌త్రి నుండి డిశ్జార్జ్ అయ్యి ఇంటి వ‌ద్దే చికిత్స తీసుకున్నాడు. కానీ మళ్లీ అరోగ్యం విష‌మించ‌డంతో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఇక ఈ విషయం తెలిసిన ప‌వ‌న్ అభిమానులు భార్గ‌వ్ మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.