హుజూరాబాద్ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న బీజేపీ పార్టీ తమ భవిష్యత్ వ్యూహాలపై పదును పెట్టింది. ఎన్నికలకు మరో రెండేళ్లే సమయం ఉండటంతో పార్టీని మరింత పట్టిష్ట పరిచేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతోంది. ప్రజా సమస్యలపై బీజేపీ పార్టీ ఏవిధంగా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించనున్నారు. మరోవైపు ముఖ్యంగా రాష్ట్రంలో రైతు సమస్యలపై నాయకులుకు దిశా నిర్థేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పాతబస్తీలోని మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించనున్నారు. ఈ భేటీకి శాసనసభా పక్షనేత రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, పొంగులేటి, విజయశాంతి, వివేక్, ప్రధాన కార్యదర్శులు, ఇంద్రసేనారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు తదితరులు హాజరయ్యారు