పవర్ స్టార్ గా జనసేన అధినేత గా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా, పవన్ ఇప్పటికీ అభిమానిస్తూ ఆరాధించే వారి సంఖ్య కు కొదవ ఏమీ లేదు. అటువంటి పవన్ ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే జనసైనికులు ఆషామాషీగా ఊరుకుంటారా ? చెడుగుడు ఆడేస్తారు. పవన్ కొన్న క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం పవన్ ఢిల్లీ టూర్ లో ఉన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన బిజెపి ఈ రెండు పార్టీలలో ఎవరు బరిలోకి దిగుతారు అనే విషయం క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే తాము అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నాము అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తుంది.
అయితే ఈ వ్యవహారం జనసేన కు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బందికరంగా మారింది. అసలు ఈ వ్యవహారంలో క్లారిటీ తెచ్చుకునేందుకు పవన్ ఇప్పుడు ఉన్నట్టుండి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అక్కడే తాడోపేడో తేల్చుకునే ఏపీలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర బీజేపీ పెద్దలు కేంద్ర మంత్రులు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వంటి వారిని కలిసి ఈ వ్యవహారంపై ఒక క్లారిటీ కి రావాలని పవన్ చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పవన్ కు ఢిల్లీ పెద్దలు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తో నే వేచి చూస్తున్నారు ఈ వ్యవహారంపై వైసిపి కార్యకర్తలు పవన్ ను ట్రోలింగ్ చేస్తూ, కామెంట్స్ చేస్తుండటం,దీనికి జనసైనికులు తమదైన శైలిలో ఘాట్ సమాధానాలు చెబుతుండడంతో సోషల్ మీడియా ఇప్పుడు జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య వార్ తో హోరు ఎత్తిపోతోంది.
పవన్ కి వెళ్లి నా బిజెపి సభ్యులు ఎవరూ పట్టించుకోలేదని వెయిటింగ్ లో పెట్టారని, పవన్ సత్తా ఏమిటో తెలిసిపోయింది అంటూ వైసీపీ సోషల్ మీడియా యక్తివిస్ట్ లు ట్రొల్ చేస్తుండడం, దీనికి ఘాటుగా జనసైనికు లు వైసీపీని విమర్శిస్తున్నారు. గతంలో జగన్ అనేక మార్లు ఢిల్లీకి వెళ్లారని అప్పుడు కూడా కేంద్ర బీజేపీ నేతలు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని దీనికి వైసిపి నాయకులు ఏం సమాధానం చెబుతారని జనసైనికులు ప్రశ్నిస్తూ ఆ పార్టీని టోల్ చేస్తూ వస్తుండడంతో సోషల్ మీడియాలో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది.