‘లాయర్ సాబ్’ గా పవన్ కళ్యాణ్….??

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది ప్రథమార్ధంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి సినిమా తరువాత, తన సినీ జీవితానికి గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ తరపున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని, జనసేన తరపున రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ రెండు ప్రాంతాల్లో కూడా ఆయన ఓటమి పాలవడంతో, ఇకపై తన పార్టీని మరింతగా ప్రజల్లో తీసుకెళ్లేలా గట్టిగా దృష్టి పెట్టారు పవన్. అయితే చివరిగా నటించిన అజ్ఞాతవాసి ఘోరంగా దెబ్బతినడంతో తమ కోసం ఒక మంచి హిట్ మూవీ చేయాలని పవన్ ఫ్యాన్స్ ఆయనను ఎప్పటినుండో కోరుతున్నారు.

ఇక ఇటీవల వారి ఆశలకు తెర దించుతూ తన తదుపరి సినిమా చేయడానికి పవన్ సిద్దము అయ్యారు. బాలీవుడ్ లో ఇటీవల అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటించడానికి పవన్ సిద్ధం అయ్యరు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన కోర్ట్ సీన్ కోసం ఒక భారీ కోర్ట్ హాల్ సెట్టింగుని సినిమా యూనిట్ మొదలెట్టినట్లు టాక్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ లాయర్ గా కన్పించనున్న ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయనుందట సినిమా యూనిట్. ఇక మరికొద్దిరోజుల్లో సినిమాలోని ఇతర నటీనటులతో పాటు టైటిల్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ నేడు ఉదయం నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అతి త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోందట సినిమా యూనిట్. కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు…!!

Read more RELATED
Recommended to you

Latest news