పవన్ కళ్యాణ్ అందుకున్న మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు.. ఏ సినిమాకంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన రేంజ్ ను నిర్ణయిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా మొదటి సారి తెలుగు పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనదైన శైలిలో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరొకవైపు రాజకీయ రంగం వైపు వేగంగా పావులు కదుపుతున్నాడు.. జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా బిజీగా మారిపోయాడని చెప్పవచ్చు ఇక సినిమాల పరంగా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నప్పటికీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచే చేస్తారని హామీ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత 1998లో తొలిప్రేమ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇదే సినిమాతో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. అంతేకాదు ఆయన సినీ కెరియర్ లో అలాగే జీవితంలో కూడా ఇదే మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు కావడం గమనార్హం.22YearsForTholiPrema: Here's why the Pawan Kalyan starrer works even 22 years after its release | Telugu Movie News - Times of Indiaఇక ప్రస్తుతం ఈయన సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ తో పాటు మరికొన్ని సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే రాజకీయపరంగా బిజీగా ఉండడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్లన్నీ పూర్తి చేస్తాడని ఆ ప్రాజెక్టుల నిర్మాతలు మీడియాతో తాజాగా వెల్లడించారు. ఇక జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు మరెన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news