టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుంది : పవన్ కళ్యాణ్

-

నాలుగు వేల మంది టిటిడి కాంటాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైనవని ఆ డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం పరిష్కరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 2010లో టీటీడీ 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను సొసైటీగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని… కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఘోర వైఫల్యం చెందిందని ఆరోపించారు.pawan kalyan ys jagan

ఉద్యోగుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించిందని మండిపడ్డారు. ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు ఇలా చెప్పుకుంటూ పోతే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్ గా మార్చడం ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్య అని వ్యాఖ్యానించారు. జస్టిస్ జె.ఎస్ ఖేహార్ ఆధ్వర్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పును పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కార్పొరేషన్ లో చేరని ఉద్యోగులను ఉద్యోగాలు పోతాయని బెదిరిస్తున్నారని వారిని కార్పొరేషన్ లో చేరాలని బలవంతం చేయడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. కార్పోరేషన్ బోర్డును నియమించే హక్కు ఎవరికి ఉందని ప్రశ్నించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news