మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ,లోక్సభ ఎన్నికలు జరగనున్నయి .ఈ నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా పొత్తుల గురించి హోం మినిస్టర్ అమిత్ షాచేసిన కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఒకట్రెండు రోజుల్లో పవన్‌కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పొత్తులపై చర్చల కోసం జనసేనను బీజేపీ అగ్రనాయకత్వం పిలిచే అవకాశం ఉంది. బహుశా, సోమవారం ఢిల్లీలో బీజేపీ, జనసేనలు పొత్తులపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోటీ చేసే లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యపై బీజేపీ, జనసేన పార్టీలు ఓ అవగాహనకు రానున్నాయి.టీడీపీతో పొత్తుల అంశంపై కూడా బీజేపీ, జనసేన నేతలు చర్చించనున్నారు అని సమాచారం. సోమ లేదా మంగళవారం రోజున పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పొత్తులపై మాత్రమే కాకుండా భవిష్యత్‌లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై ,ఏఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో పవన్‌తో పార్టీ పెద్దలు చర్చించనున్నారని సమాచారం.