PAWAN KALYAN : షర్మిల కొత్త పార్టీ పై పవన్ కళ్యాణ్ కామెంట్

-

ఇవాళ సాయంత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల.. ఇవాళ కొత్త పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. షర్మిల కొత్త పార్టీపై అన్ని పార్టీల నేతల తమదైన స్టైల్‌ లో స్పందించారు. కొందరు వ్యతిరేకించగా మరికొందరు సపోర్ట్‌ చేశారు. అయితే.. తాజాగా… వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలోలో షర్మిల పెట్టబోతున్న కొత్త పార్టీకి స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్న పవన్‌ కళ్యాణ్‌… ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని తెలిపారు. తెలంగాణలో పార్టీ నడిపే బలం తనకు లేదని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అని..కొత్తరక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాలన్నారు.  కాగా.. ఇవాళ సాయంత్రమే పార్టీ ప్రకటన ఉన్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9 గంటలకు షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌కి నివాళులర్పించారు. 10.30కి ఇడుపుల పాయ నుంచి ఆమె హైదరాబాద్ బయలు దేరారు.

మధ్యాహ్నం 1 గంటకి బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి చేరుకోని… బేగంపేట,అమీర్‌పేట, లాల్‌బంగ్లా మీదుగా పంజాగుట్టకి చేరుకుంటారు. పంజాగుట్ట‌లోని వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున సర్కిల్, మాసబ్ టాంక్, మెహిదీపట్నం మీదుగా జేఆర్సీ సెంటర్‌ల మీదుగా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3 గంటలనుంచి 7 లోపు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news