కోవాగ్జిన్ అత్యవస వినియోగంపై సందిగ్థం కొనసాగుతోంది. తాజాగా నేడు మరోసారి WHO సాంకేతిక సలహా కమిటీ కోవాగ్జిన్ అత్యవస అనుమతులపై భేటీ కానుంది. భారత దేశానికి చెందిన హైదరాబాద్ బెస్డ్ భారత్ బయోటిక్ రూపొందిన కోవాగ్జిన్ అత్యవసర అనుమతుల విషయమై WHO సాంకేతిక సలహా కమిటీ అక్టోబర్ 26న భేటీ అవుతున్నట్లు ఆసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్ లో తెలిపారు. గతంలో కోవాగ్జిన్ అత్యవసర అనుమతుల విషయంపై మరింత సమచారం కావాలని WHO కోరింది. ప్రస్తుతం WHO అత్యవసర అనుమతులను ఇస్తే ప్రపంచం వ్యాప్తంగా కొవాగ్జిన్ వాడకానికి అనుమతి లభించినట్లు అవుతుంది. వాక్సిన్ ను పూర్తిగా అంచానా వేసి అనుమతులు ఇవ్వడానికి కొన్ని సార్లు ఎక్కువ రోజులు పడుతుందని WHO అధికారులు చెబుతున్నారు. భారత్ బయోటిక్ చెబుతున్నదాని ప్రకారం కోవాగ్జిన్ ఫేస్ 3 ట్రయల్స్ లో 77.8 శాతం ఎఫిషియెన్సీని కలిగి ఉందని తెలిసింది. ప్రస్తుతం భారత్ లో చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, రష్యా తయారీ స్పుత్నిక్ వీ తో పాటు కోవాగ్జిన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. WHO ఇప్పటి వరకు ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా, చైనా తయారీ సినోవాక్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు ఇచ్చింది.
కోవాగ్జిన్ భవితవ్యం తేలేది నేడే.. అత్యవసర వినియోగంపై WHO కీలక భేటీ.
-