చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌

-

టాలీవుడ్‌ అగ్ర హీరో మెగాస్టార్‌ చిరంజీవి నేడు పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌ పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుగురు సీని ప్రముఖులు, రాజకీయా నాయకులు, మిత్రులు, మరియు అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభా కాంక్షలు చెప్పారు.

అయితే ఈ నేపథ్యం లో చిరంజీవి ఇంటికి స్వయంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి బర్త్‌ డే విషెస్‌ చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ… చిరంజీవి నాకు మాత్రమే మార్గదర్శకుడు కాదని… ఎంతో మందికి స్ఫూర్తి అని తెలిపారు పవన్‌. మెగా స్టార్‌ తనకు తండ్రి లాంటి వారని.. కరోనా సమయంలోనూ ఎంతో మంది కార్మికులకు సహాయం చేశారని గుర్తు చేశారు. కాగా.. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున కూడా పవన్‌ ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news