సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.సీఎం జగన్లా తనపై 32 కేసులు లేవని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..’జగన్లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేను. ఆయనకు కాపుల ఓట్లు మాత్రమే కావాలి అని,వారి అభివృద్ధి పట్టదు అని విమర్శించారు. నేను ఒక్క కులం కోసం పనిచేయను. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీఏతో కలిశాం అని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రతీ చేనుకు నీరు.. ప్రతీ చేతికి పని.. ఇదే మా నినాదం. ఆక్వా రైతులకు అండగా ఉంటాం’ అని హామీ ఇచ్చారు.
పదేళ్ల కష్టాల మధ్య జనసేన పార్టీ పెరిగిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తాను మొగల్తూరులోని చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చానని, చిన్న, చిన్న పట్టణాల్లో పెరిగానన్నారు. ప్రతి మనిషి పడే కష్టం తనకు తెలుసని, నరసాపురంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని ,తన అన్నయ్య చిరంజీవి నరసాపురంలోనే చదువుకున్నారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.