ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు పవన్ కల్యాణ్ సంచలన హామీలు

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన హామీలు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పెన్షన్ పంపిణీ చేస్తామని, అలాగే పాఠశాలకు వెళ్లే విద్యార్థికి ప్రతి సంవత్సరం రూ. 15 వేలు ఇస్తామని తెలిపారు.రైతులకు ఏడాదికి రూ. 20 వేలు సాయం చేస్తామన్నారు.

ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు .విశిష్ట వారధిని నిర్మిస్తామన్నారు. కోనసీమలో రైలు కూత వినిపిస్తుందని ,పోలవరాన్ని పూర్తి చేస్తామని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.ప్రతి మనిషి పడే కష్టం తనకు తెలుసని ,నరసాపురంతో తమకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి నరసాపురంలోనే చదువుకున్నారని పవన్ గుర్తు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news