పవన్-రానా సినిమా షూటింగ్ షురూ..పోలీస్ గెటప్ లో పవర్ స్టార్

-

కరోనా మహమ్మారి తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి సెట్స్ పైకి వచ్చేసారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ ను తిరిగి మొదలు పెట్టారు. హైదరాబాద్ శివారులో ఉన్న ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇవాల్టి నుంచి ప్రారంభం అయింది. నిజానికి ఈ నెల 12న ఈ మూవీ ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్నారు.

ఈ మేరకు సూట్ స్టార్ట్ చేయడానికి పవన్ కూడా ఓకే చెప్పేశాడట. కానీ నీ సినిమాటోగ్రాఫర్ తో పాటు ఇతర సమస్యల కారణంగా ఈ సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. అయితే ఆ వివాదాలు అన్నిటినీ ముగించుకున్న చిత్ర బృందం… ఇవాల్టి నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. అయితే తాజాగా షూటింగ్ స్పాట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతోంది.  ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తాడు. దీంతో పవన్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  కాగా ఈ సినిమాలో లో లో పవన్కళ్యాణ్ సరసన నిత్యమీనన్ మరియు రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news