పే పర్ వ్యూ పద్దతిలో సోలో బ్రతుకే సో బెటరు.. ?

-

థియేటర్లు మూతపడిన కారణంగా సినిమాలన్నీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా పలకరించాయి. మొన్నటికి మొన్న అనుష్క నిశ్శబ్దం సినిమాతో పాటు రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా ఓటీటీలో రిలీజైంది. వీటి ఫలితాల గురించి పక్కన పెడితే తాజాగా మరో తెలుగు సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు జీ ప్లెక్స్ లో రిలీజ్ కానుంది.

నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఐతే ఈ సినిమాని ఓటీటీలో డైరెక్టుగా చూడలేం. ఎందుకంటే ఈ సినిమాకి పే పర్ వ్యూ పద్దతిని ప్రవేశ పెడుతున్నారు. అంటే ఈ సినిమా చూడాలంటే జీ ప్లెక్స్ సబ్ స్క్రిప్షన్ తో పాటు చూడడానికి కొద్దిగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రమైన ఖాలీ పీలీ సినిమాకి ఇలాంటి పద్దతే పెట్టారు.

ఐతే అటు సబ్ స్క్రిప్షన్ తో పాటు సినిమా చూడడానికి కూడా డబ్బులు కట్టాలంటే ఎంతమంది చూస్తారనేదే ప్రశ్న. అదీగాక మరికొన్ని రోజుల్లో థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు కట్టి మరీ చూడాలంటే కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news