ప్రారంభమైన జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ.!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 42వ సమావేశం ప్రారంభమైంది..వర్చువల్ విధానంలో ప్రారంభమైన సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు పాల్లొన్నారు..జీఎస్‌టీ నష్ట పరిహారం చెల్లింపుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకతిరేకిస్తున్నాయి. జీఎస్‌టీ రెవిన్యూ నష్టాన్ని అప్పుల ద్వారా భర్తీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీకి వివిధ అంశాల్లో మద్దతుగా నిలుస్తున్న పార్టీలు పరిపాలిస్తున్న 21 రాష్ట్రాలు అంగీకరించాయి.ఈ సామావేశంలో జీఎస్‌టీ నష్టపరిహారం లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని రాష్ట్రప్రభుత్వాలు డిమాండ్ చేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news