లాక్ డౌన్ ఉన్నా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి…? వాస్తవాలు చెప్పండి…!

-

14 గంటలు ఇంట్లో ఉంటే గొలుసు తెగిపోతుంది అన్నారు. ప్రజలు 21 రోజులు ఇళ్ళలో ఉన్నారు. మధ్యలో నిజాముద్దీన్ కేసులు అనుకోకుండా వచ్చాయి. అవి ఎక్కువగా మార్చ్ 31, ఏప్రిల్ 1 అప్పుడు పెరిగాయి. అప్పటి నుండి మళ్ళీ 14 రోజులకు ఇప్పుడు దేశమంతా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో అయితే మార్చ్ 29,30,31 ప్రాంతంలో జనం గుంపులు గుంపులుగా రేషన్ కోసం క్యూలలో నిలబడటం చూసాము.

ప్రజలు తమ పరిధిలో ప్రభుత్వాలకు వారి శక్తికి మించి సహకరిస్తున్నారు. రైతులు, దినసరి కూలీల, వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉన్నా ఎవరికి వారు కష్టాలను దిగమింగి ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. అందరూ ఇంటిపట్టున ఉంటే మరి కేసులెందుకు ఇంకా ఇంకా పెరుగుతూ పోతున్నాయి?

* ఇంకా నిజాముద్దీన్ ప్రభావం వల్ల వారి కుటుంబ సభ్యుల కేసులు పెరుగుతున్నాయా?
* ఐసొలేషన్ సెంటర్లలో ఉన్నవారికి మాత్రమే వస్తుందా?
* రాత్రింబగళ్ళు శ్రమిస్తున్న వివిధ విభాగాల సిబ్బందికి వస్తుందా?
* రేషన్ కోసం, ఇతర నిత్యావసరాల కోసం షాపులకూ, మార్కెట్లకూ వెళ్ళిన వారికి వస్తుందా?

కమ్యూనిటీ స్ప్రెడ్ మొదలయ్యిందా?

చిత్తశుద్ధి, పారదర్శకత ఉంటే అన్ని ప్రభుత్వాలూ ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఎలా వస్తుంది? అన్న దానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రజలకు ఉపయోగపడే సమాచారం ఇవ్వకుండా కేవలం కొత్త కేసులెన్ని, నయం అయ్యింది ఎందరికి? మరణాలెన్ని వంటి సంఖ్యలను మాత్రం విడుదల చేస్తూ ప్రజలను చీకట్లో ఉంచడం భావ్యం కాదు. పరిస్థితి ఇలా ఉంటే మే 3 వరకూ అంటే 42 రోజులు జనం ఇళ్ళలోనే ఉంటున్నా ప్రభుత్వాలు అంకెలు మాత్రం పబ్లిష్ చేస్తూ పోతే ఏమి ప్రయోజనం?

Read more RELATED
Recommended to you

Latest news