బాయ్ ఫ్రెండ్ తో హద్దులు చెరిపేస్తున్న పాయల్.. నెటిజన్స్ షాక్..!

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా తాను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారుతున్నాయి.

పాయల్ రాజ్ పుత్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే . సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ఆమె ప్రేమిస్తున్నారు. సౌరబ్ యాక్టర్ కం మోడల్ అలాగే నిర్మాత కూడా.. పాయల్ బుల్లితెరలో నటించిన సమయంలో సౌరబ్ దింగ్రా తో పరిచయం ఏర్పడింది. అ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా సౌరబ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని హాట్ ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది. ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె హద్దులు చెరిపేస్తోంది అంటూ ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.

ఆ బోల్డ్ ఫోటోషూట్ ఎలా ఉంది అంటే బ్యాక్ లెస్ ఫోటోషూట్ షేర్ చేసి అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో పాయల్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఫోటోలతో పాటు పాయల్..” గత కొన్ని జీవితంలో కఠినమైన రోజులు అని తెలుసు.. జీవితం అంటే అంతే టఫ్.. కానీ నీకు ఆ భగవంతుడు సమస్యలు ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నా సంతోషానికి ,నవ్వుకు, అందమైన జీవితానికి నీవే కారణం” అంటూ రాసుకొచ్చింది పాయల్..

Read more RELATED
Recommended to you

Latest news